తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ క్రికెటర్​ అలెక్స్​ హేల్స్​కు కరోనా!

ఇంగ్లాండ్​ క్రికెటర్​ అలెక్స్​ హేల్స్​కు కరోనా సోకిందన్న వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలే ఈ ఆటగాడు పాకిస్థాన్​ సూపర్​ లీగ్​(పీఎస్​ఎల్​)లో ఆడాడు. ఆ సమయంలో అతడు కొవిడ్​-19 లక్షణాలతో బాధపడ్డాడని పాక్​ మాజీ క్రికెటర్​, వ్యాఖ్యాత రమీజ్​ రాజా వెల్లడించాడు.

PSL Corona: England's Alex Hales might have Covid-19 symptoms before leaving tourney by ramiz raja
పీఎస్​ఎల్​లో కరోనా.. ఇంగ్లాండ్​ క్రికెటర్​ అలెక్స్​ హేల్స్​కు!

By

Published : Mar 17, 2020, 5:41 PM IST

పాకిస్థాన్​ సూపర్ లీగ్​(పీఎస్​ఎల్​)లో ఓ ఆటగాడికి కరోనా లక్షణాలు కనిపించాయని చెప్పాడు ఆ దేశ మాజీ క్రికెటర్​, వ్యాఖ్యాత రమీజ్​ రాజా. ఇంగ్లాండ్​కు చెందిన అలెక్స్​ హేల్స్​ టోర్నీ సమయంలో.. కొవిడ్​-19 లక్షణాలతో ఉన్నట్లు రమీజ్​ అభిప్రాయపడ్డాడు. కరాచీ కింగ్స్​ తరఫున 7 మ్యాచ్​లు ఆడిన హేల్స్​.. కరోనా నేపథ్యంలో మిగతా ఇంగ్లీష్​ ఆటగాళ్లతో కలిసి టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే అతడు ఎలాంటి టెస్టులు చేయించుకోకుండానే ఇంగ్లాండ్ వెళ్లాడని​ చెప్పాడు రమీజ్​.

ఇంగ్లాండ్​ క్రికెటర్​ అలెక్స్​ హేల్స్​

"నాకు తెలిసినంత వరకు అలెక్స్​ హేల్స్​ టెస్టులు చేయించుకోలేదు. అయితే టోర్నీ సమయంలో అతడు కరోనా తరహా లక్షణాలతో బాధపడ్డాడు. అయితే వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి విషయాల్లో అందరూ జాగ్రత్త వహించాలి".

- రమీజ్​ రాజా, పాక్​ మాజీ క్రికెటర్​

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు సీఈవో వసీం ఖాన్​ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓ విదేశీ ఆటగాడు కరోనాతో ఇబ్బంది పడినట్లు చెప్పిన ఖాన్​.. అతడి వివరాలు చెప్పడానికి నిరాకరించాడు.

మంగళవారం లాహోర్​ వేదికగా జరగాల్సిన పీఎస్​ఎల్ సెమీఫైనల్​తో పాటు ఫైనల్​ మ్యాచ్​లను.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రద్దు చేశారు. పీఎస్​ఎల్ ఆటగాళ్లు, ప్రసారదారు సంస్థకు సంబంధించిన వ్యక్తులకు కొవిడ్​-19 టెస్టులు​ చేసినట్లు చెప్పారు నిర్వాహకులు. ఇప్పటికే ఈ వైరస్​ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7వేల మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details