తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ నీ పట్ల గర్వంగా ఫీలవుతున్నా: సచిన్​ - tendulkar comments on virat

భారత కెప్టెన్ విరాట్​ కోహ్లీపై.. క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కర్​ ప్రశంసలు కురిపించాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా విరాట్​ పడిన మనోవేదనను బయటకు చెప్పడం గొప్ప విషయమని కొనియాడాడు. ఒత్తిడిని అధిగమించడానికి కోహ్లీ చేసిన ప్రయత్నాన్ని మాస్టర్​ మెచ్చుకున్నాడు.

'Proud' Tendulkar lauds Kohli for opening up on battle against depression
కోహ్లీ నీ పట్ల గర్వంగా ఫీలవుతున్నా: సచిన్​

By

Published : Feb 20, 2021, 5:25 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ పట్ల తాను గర్వంగా ఉన్నానని భారత మాజీ క్రికెటర్ సచిన్​ తెందుల్కర్ పేర్కొన్నాడు. 2014 ఇంగ్లాండ్​ పర్యటన సందర్భంగా కోహ్లీ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి బయటకు చెప్పడం గొప్ప విషయమని తెలిపాడు. సదరు పర్యటన అనంతరం ఒత్తిడిని అధిగమించేందుకు విరాట్​ చేసిన ప్రయత్నాన్ని మాస్టర్​ కొనియాడాడు.

"విరాట్​.. నీ విజయం పట్ల గర్వంగా ఉంది. నీ వ్యక్తిగత విషయాలను మాతో పంచుకోవడం గొప్ప విషయం. ఈ రోజుల్లో యువకులు సామాజిక మాధ్యమాల్లో ఇతరుల గురించి చర్చిస్తున్నారు. తమ గురించి తాము మాట్లాడటం లేదు." అంటూ సచిన్ ట్వీట్​ చేశాడు.

2014 ఇంగ్లాండ్​ పర్యటన సందర్భంగా కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. సదరు టూర్​లో విరాట్.. పది ఇన్నింగ్స్​ల్లో కలిపి 135 పరుగులు మాత్రమే సాధించాడు. రెండు సార్లు డకౌట్​గా వెనుదిరిగాడు. అప్పుడు ప్రపంచంలో తానొక్కడినే ఒంటరిగా మిగిలిపోయినట్లు భావించానని కోహ్లీ ఇటీవల తెలిపాడు. ఈ నేపథ్యంలోనే సచిన్​ పైవ్యాఖ్యలు చేశాడు.

ఇదీ చదవండి:'ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడిని అనిపించింది'

ABOUT THE AUTHOR

...view details