తెలంగాణ

telangana

ETV Bharat / sports

పృథ్వీషా మెరుపు ఇన్నింగ్స్​.. సెమీస్​కు ముంబయి

దేశవాళీ టోర్నీ విజయ్​ హజారే సెమీఫైనల్స్​లో ముంబయి జట్టు అడుగుపెట్టింది. క్వార్టర్స్​ సౌరాష్ట్ర జట్టును చిత్తు చేసి.. సెమీస్​కు చేరుకుంది. కెప్టెన్​ పృథ్వీషా శతకంతో రెచ్చిపోయి ముంబయి జట్టు విజయానికి కారణమయ్యాడు.

Prithvi Shaw steers Mumbai into Hazare semis, crush Saurashtra by 9 wickets
పృథ్వీషా మెరుపు ఇన్నింగ్స్​.. సెమీస్​కు ముంబయి

By

Published : Mar 9, 2021, 6:49 PM IST

విజయ్​ హజారే ట్రోఫీ సెమీఫైనల్స్​లో ముంబయి జట్టు అడుగుపెట్టింది. మంగళవారం సౌరాష్ట్రతో జరిగిన క్వార్టర్స్​లో ముంబయి 9 వికెట్ల తేడాతో గెలుపొంది టోర్నీ సెమీస్​కు చేరింది. కెప్టెన్​ పృథ్వీషా(185) అజేయ శతకంతో జట్టును విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి జట్టు ఓపెనర్లు నిలకడగా బ్యాటింగ్​ చేసి మొదటి వికెట్​కు 238 రన్స్​ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్​ పృథ్వీషా 185 పరుగులు చేయగా.. అందులో 21 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. యశస్వీ జైశ్వాల్​ 75 పరుగులు చేసి ఉనద్కట్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు.

కీలక ఆటగాళ్లు దూరమైనా..

అయితే ఇంగ్లాండ్​తో పరిమిత ఓవర్ల సిరీస్​కు ఎంపికైన కారణంగా ముంబయి కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​, బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యూదవ్​ దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ముంబయి పగ్గాలు చేపట్టిన​ పృథ్వీషా.. జట్టును సెమీస్​కు చేర్చాడు.

సెమీస్​కు చేరిన జట్లు

గుజరాత్​, కర్ణాటక జట్లు ఇప్పటికే సెమీస్​​కు అర్హత సాధించాయి. గురువారం ఈ టోర్నీ సెమీఫైనల్​ మ్యాచ్​లు నిర్వహించనుండగా.. ఆదివారం ఫైనల్​ జరగనుంది.

ఇరుజట్లు స్కోర్లు:సౌరాష్ట్ర 284/5 (సామర్థ్​ వ్యాస్​ 90 నాటౌట్​; షామ్స్​ ములానీ 2-51); ముంబయి 285/1 (పృథ్వీషా 185 నాటౌట్​; జయదేవ్​ ఉనద్కట్​ 1-52)

ఇదీ చూడండి:ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​ ఆడేందుకు సిద్ధం: హార్దిక్​

ABOUT THE AUTHOR

...view details