తెలంగాణ

telangana

ETV Bharat / sports

పృథ్వీషా 'డబుల్'​ ధమాకా.. ఆధిక్యంలో ముంబయి - Ranji Trophy-2019

భారత యువ క్రికెటర్​ పృథ్వీషా.. బుధవారం బరోడాతో జరిగిన రంజీ మ్యాచ్​లో విశ్వరూపం చూపించాడు. రంజీ క్రికెట్లో మూడో వేగవంతమైన ద్విశతకంతో అదరగొట్టాడు.

పృథ్వీషా తొలి ద్విశతకం
భారత యువ క్రికెటర్​ పృథ్వీషా

By

Published : Dec 12, 2019, 5:31 AM IST

Updated : Dec 12, 2019, 8:54 AM IST

ముంబయి వేదికగా జరుగుతోన్న రంజీ మ్యాచ్​లో భారత యువ క్రికెటర్​ పృథ్వీషా మెరిశాడు. ఫస్ట్​ క్లాస్​ కెరీర్​లో తొలి డబుల్​ సెంచరీ (174 బంతుల్లో)తో అదరగొట్టాడు. బరోడాతో జరిగిన మ్యాచ్​లో ఈ ఘనత సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా ద్విశతకం చేసిన మూడో క్రికెటర్​గా నిలిచాడు. ఫృథ్వీషా కన్నా ముందు ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి (123 బంతులు), రాజేశ్ బోరా (156) ఉన్నారు.

పృథ్వీషా 'డబుల్'​ ధమాకా

షా.. 202 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.ముంబయి 409/4 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. బరోడా ముందు 534 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. మూడో రోజు ఆట ముగిసే సరికి బరోడా 3 వికెట్లకు 74 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి 431 పరుగులు చేయగా.. బరోడా 307 పరుగులకే ఆలౌటైంది.

దాదాపు 8 నెలల నిషేధం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన పృథ్వీషా.. ఇటీవలే 'సయ్యద్ ముస్తాక్ అలీ'లో అద్భుతంగా రాణించాడు. 5 మ్యాచ్​ల్లో మూడు అర్ధశతకాలు చేశాడు.

Last Updated : Dec 12, 2019, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details