న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో విఫలమైన యువ ఓపెనర్ పృథ్వీషా.. రెండో టెస్టులో ఆకట్టుకున్నాడు. 54 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే మంచి జోరుమీదున్న సమయంలో, జెమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే కివీస్ గడ్డపై ఓ రికార్డును నెలకొల్పాడు.
దిగ్గజ సచిన్ తర్వాత పృథ్వీషాదే అక్కడ రికార్డు - sports news
కివీస్‌తో రెండో టెస్టు ఆడుతున్న పృథ్వీషా.. అరుదైన రికార్డు నెలకొల్పాడు. దిగ్గజ సచిన్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
యువ ఓపెనర్ పృథ్వీషా
న్యూజిలాండ్‌లో ఆ దేశంపై టెస్టుల్లో అర్ధశతకం బాదిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ సచిన్ తెందుల్కర్ ముందున్నాడు. షా.. 20 సంవత్సరాల 112 రోజుల్లో చేయగా, సచిన్.. 16 సంవత్సరాల 291 రోజుల్లోనే ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 63/0తో నిలిచింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన.. 242 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి(55) టాప్ స్కోరర్.
Last Updated : Mar 3, 2020, 12:09 AM IST