తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీ త్వరగా కోలుకో: మోదీ - యాంజియో ప్లాస్టీ చికిత్స చేసుకున్న గంగూలీ

ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గంగూలీతో మాట్లాడారు మోదీ.

PM Modi speaks to Saurav Ganguly
గంగూలీ త్వరగా కోలుకో: మోదీ

By

Published : Jan 3, 2021, 8:40 PM IST

భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీతో మాట్లాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇటీవలే గంగూలీకి గుండె పోటు రావడం వల్ల 'యాంజియోప్లాస్టీ' చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో దాదా ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు మోదీ.

గంగూలీ త్వరగా కోలుకోవాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో దాదా సతీమణితోనూ మాట్లాడారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని కోల్​కతా ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:థాయ్​లాండ్​ పయనమైన భారత బ్యాడ్మింటన్ బృందం

ABOUT THE AUTHOR

...view details