భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తాచాటాడు. స్విట్జర్లాండ్ బాసెల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఒలింపిక్స్ స్వర్ణ పతక గ్రహీత లిన్ డాన్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.
రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన లిన్‌పై చెమటోడ్చి గెలిచాడు ప్రణయ్. గంటా రెండు నిమిషాలు పాటు జరిగిన ఈ పోరులో 21-11, 13-21, 21-7 తేడాతో విజయం సాధించాడు. ఇరువురు ఐదు సార్లు ముఖాముఖి తలపడగా.. ప్రణయ్ 3 సార్లు గెలిచాడు. లిన్ రెండు సార్లు నెగ్గాడు.