తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా విజయాల హ్యాట్రిక్.. ప్రశంసలే ప్రశంసలు - kohli win

ఇంగ్లాండ్​పై వన్డే సిరీస్​ను గెల్చిన భారత్.. అంతకు ముందు టెస్టు, టీ20 సిరీస్​లను కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టింది. ఈ సందర్భంగా మాజీలు, సహచరులు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.

praise tweets on team india for victory on england 3rd ODI
టీమ్​ఇండియా విజయాల హ్యాట్రిక్.. ప్రశంసలే ప్రశంసలు

By

Published : Mar 29, 2021, 12:08 PM IST

ప్రపంచ విజేత ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ గెలవడం వల్ల టీమ్‌ఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో.. కొవిడ్‌ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నా.. బయో బుడగలో సాధించిన ఈ విజయం అపురూపమని కీర్తిస్తున్నారు. క్రీడా దిగ్గజాలు, రాజకీయ నాయకులు మొదలుకొని పారిశ్రామిక, సినీ ప్రముఖుల వరకు కోహ్లీసేనను అభినందిస్తున్నారు. అభిమానులైతే రకరకాల మీమ్స్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఎవరెవరు ఎలా స్పందించారంటే?

'గత వందేళ్లలో ఇంతలా ఎప్పుడూ అలిసిపోలేదు! అత్యంత కఠిన పరిస్థితుల్లో కలలుగనే సీజన్‌ ఇది!! ఆస్ట్రేలియాపై 5/6 సిరీస్‌ విజయాలు.. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై 3 ఫార్మాట్లలో విజయ దుందుభి.. కుర్రాళ్లు అదరగొట్టారు' అని టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ అన్నారు.

'కుర్రాళ్లకు అభినందనలు. జీవితకాలంలోనే అత్యంత కఠిన పరిస్థితుల్లో మీరీ సీజన్‌ ఆడారు. అన్ని ఫార్మాట్లలో గొప్ప విజయాలు సాధించారు. ప్రపంచంలోనే రెండు అత్యుత్తమ జట్లు ఉత్కంఠగా తలపడ్డాయి. అందుకు మీకు వందనం' అని భారత కోచ్‌ రవిశాస్త్రి ట్వీట్‌ చేశారు.

'సిరీస్‌ను ఎంతో అద్భుతంగా ముగించారు! సామ్‌ కరన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌. కానీ టీమ్‌ఇండియా గీత దాటేసింది. నాలుగున్నర నెలల సీజన్‌కు తిరుగులేని ముగింపు ఇది. తాము సాధించిన దానికి భారత జట్టు ఎంతగానో గర్వించాలి' అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు.

'మూడుకు మూడూ గెలిచేశాం' అని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details