తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ మహిళా ప్లేయింగ్ ఎలెవన్​లో భారత్ నుంచి ఒక్కరే​ - women's cricket team

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన 'మహిళల టీ20 ప్రపంచకప్ ప్లేయింగ్ ఎలెవన్​' జట్టులో భారత్ ​నుంచి పూనమ్​ యాదవ్ మాత్రమే ఎంపికైంది. యువ సంచలనం షెఫాలీ వర్మకు 12వ ప్లేయర్​గా స్థానం దక్కింది. ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు చోటు లభించింది.​

poonam yadav
ఐసీసీ మహిళల ప్రపంచకప్​ జట్టులో ఏకైక భారత ప్లేయర్​

By

Published : Mar 9, 2020, 1:20 PM IST

Updated : Mar 9, 2020, 1:53 PM IST

మహిళల క్రికెట్​ ప్రపంచకప్​లో అద్భుత ప్రతిభ కనబర్చిన ప్లేయర్లతో 'ఉమెన్స్​ టీ20 ప్లేయింగ్​ ఎలెవన్' జట్టును ప్రకటించింది ఐసీసీ. భారత లెగ్​ స్పిన్నర్ పూనమ్​ యాదవ్​కు మాత్రమే ఇందులో చోటు దక్కింది. విధ్వంసకర ఆటతీరుతో మెప్పించిన యువ సంచలనం షెఫాలీ వర్మ 12వ ప్లేయర్​గా ఎంపికైంది.

ఫైనల్లో భారత్​ను ఓడించి ఐదోసారి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు ఐసీసీ జట్టులో స్థానం దక్కింది. ఆసీస్​ ఓపెనర్లు హేలీ, మూనీ, కెప్టెన్​ మెగ్​ లానింగ్​తో పాటు ప్రపంచకప్​లో 13 వికెట్లు సాధించి టాప్ బౌలర్​గా నిలిచిన మేగన్​ షట్​, ఆల్​రౌండర్​ జొనాసెన్​లు ఎంపికయ్యారు.

ఇంగ్లాండ్​ నుంచి స్కీవర్, హీథర్ నైట్, సోఫీ ఎక్​లెస్టోన్​, అన్యా శ్రుబ్సోలే ఎంపికై నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నారు. రెండు ఇన్నింగ్స్​ మాత్రమే ఆడిన సౌతాఫ్రికా బ్యాట్​ఉమెన్​ లౌరా వోల్వర్డ్​కు ఐసీసీ జట్టులో స్థానం లభించింది.

టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్​ మ్యాచ్​లో 4 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది పూనమ్ యాదవ్. బంగ్లాదేశ్​పై మూడు వికెట్లు, న్యూజిలాండ్, శ్రీలంకపై ఒక్కో వికెట్, ఫైనల్​లో మరో వికెట్​తో మొత్తం 10 వికెట్లు పడగొట్టింది.

ప్రపంచకప్​లో విధ్యంసకర బ్యాటింగ్​తో అలరించిన టీమిండియా ఓపెనర్​ షెఫాలీ వర్మ 158.25 స్ట్రైక్​రేట్​తో 163 పరుగులు చేసింది. ఈమెను 12వ ప్లేయర్​గా ఎంపిక చేసింది ఐసీసీ.

ఇదీ చూడండి: వన్డే సిరీస్​ కోసం భారత్​ చేరుకున్న సఫారీలు

Last Updated : Mar 9, 2020, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details