తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుష్​ఫైర్​ బాష్: గిల్​క్రిస్ట్​ జట్టుపై పాంటింగ్ సేన విజయం

ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్థం నేడు మెల్​బోర్న్ క్రికెట్‌ మైదానంలో ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించింది ఆసీస్​ బోర్డు. ఇందులో పలువురు దిగ్గజ క్రికెటర్లు రికీ పాంటింగ్​, గిల్​క్రిస్ట్​ జట్ల తరఫున ఆడారు. 10 ఓవర్ల మ్యాచ్​లో పాంటింగ్​ సేన 104 రన్స్​ చేయగా.. ఛేదనలో 6 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఫలింతగా పాంటింగ్ సేన ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

Ponting XI vs Gilchrist XI, Bushfire Bash match tied at 104 runs
బుష్​ఫైర్​ బాష్: గిల్​క్రిస్ట్-పాంటింగ్​ మ్యాచ్​ టై

By

Published : Feb 9, 2020, 12:06 PM IST

Updated : Feb 29, 2020, 5:44 PM IST

ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్ వేదికగా జరిగిన 'బుష్​ఫైర్​ క్రికెట్​ బాష్'​లో దిగ్గజ క్రికెటర్లు అలరించారు. అప్పటి ఫామ్, ఆ చురుకుదనం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఇందులో రికీ పాంటింగ్​ ఎలెవన్, గిల్​క్రిస్ట్ ఎలెవన్​ జట్లు తలపడగా.. మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​, టిమ్​ పైన్​ ఇరుజట్లకు కోచ్​లు​గా వ్యవహరించారు. తొలుత బ్యాటింగ్​ చేసిన పాంటింగ్​ జట్టు 10 ఓవర్లలో 104 రన్స్​ చేసింది. ఛేదనలో గిల్లీ జట్టు 103 పరుగులకు పరిమితమైంది.

పాంటింగ్​, గిల్​క్రిస్ట్​ జట్లు

గిల్​క్రిస్ట్​ అదే జోరు..

ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్​ గిల్​క్రిస్ట్​ ఛేదనలో అదరగొట్టేశాడు. ఓపెనర్​గా బరిలోకి దిగిన ఇతడు.. 9 బంత్లులో 2 ఫోర్లు, 1 సిక్సర్​ సాధించి 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ల్యూక్​ హడ్జ్​ బౌలింగ్​లో క్లీన్​బౌల్డ్​గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్​ వాట్సన్​ 30(9 బంతుల్లో; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి రిటైర్డ్​ హర్ట్​గా వెనుదిరిగాడు.

గిల్లీ జట్టులో బరిలోకి దిగిన యువీ 2(5 బంతుల్లో) నిరాశపర్చాడు. సైమండ్స్​ మాత్రం చితక్కొట్టి రిటైర్డ్​ హర్ట్​గా వెనుదిరిగాడు. 13 బంతుల్లో 29 రన్స్​ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కేమరూన్​ స్మిత్​(5), రైవోల్ట్​(9) అజేయంగా నిలిచారు.

పాంటింగ్​ జట్టు బౌలర్లలో బ్రెట్​లీ రెండు వికెట్లు సాధించాడు. అప్పటి పేస్​ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఫవద్​ అహ్మద్​ ఒక వికెట్​ తీశాడు. పాక్ దిగ్గజం వసీం అక్రమ్ బౌలింగ్​తో ఆకట్టుకున్నాడు.

లారా-పాంటింగ్​ అదుర్స్​...

తొలుత బ్యాటింగ్​ చేసిన పాంటింగ్​ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 రన్స్​ చేసింది. లారా 30 పరుగులు(11 బంతుల్లో; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పాంటింగ్​ 26( 14 బంతుల్లో; 4 ఫోర్లు) సూపర్​ ఇన్నింగ్స్​ ఆడారు. వీరికి తోడుగా మాథ్యూ హెడెన్​ 16(14 బంతుల్లో; 1 ఫోర్​, 1 సిక్సర్​), లిచ్​ఫీల్డ్​(9), జస్టిన్​ లాంగర్​(6), అలెక్స్​ బ్లాక్​వెల్​(2*), ల్యూక్​ హోగ్డే(11*) మంచి ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్​లో 4 పరుగులు వైడ్​ల రూపంలో వచ్చాయి.

లారా, పాంటింగ్​

గిల్​క్రిస్ట్​ జట్టు బౌలర్లలో కోర్ట్నే వాల్ష్​, యువరాజ్​ సింగ్​, ఆండ్రూ సైమండ్స్​ తలో వికెట్​ తీసుకున్నారు.

విరామంలో సచిన్​ దూకుడు...

తొలి బ్యాటింగ్​ అనంతరం బ్రేక్​ సమయంలో బ్యాట్​తో అలరించాడు భారత దిగ్గజం సచిన్​. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎలిస్​ పెర్రీ బౌలింగ్​లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. 6 బంతులు ఆడి అజేయంగా నిలిచిన సచిన్​.. ఈ మ్యాచ్​లో పాంటింగ్​ జట్టుకు కోచ్​గా వ్యవహరించాడు.

సచిన్​ బ్యాటింగ్​ తీరు

దిగ్గజాలతో 16 ఏళ్ల అమ్మాయి..

ఈ మ్యాచ్​లో దిగ్గజాలతో 16 ఏళ్ల అమ్మాయి బరిలోకి దిగింది. బిగ్​బాష్​ లీగ్​లో రాణించిన ఫోబే లిచ్​ఫీల్డ్​కు మాజీలతో ఆడే ఛాన్స్​ దక్కింది. పాంటింగ్​ జట్టు తరఫున బ్యాటింగ్​ చేసిన ఈ చిన్నారి... 9 పరుగులు చేసింది.

Last Updated : Feb 29, 2020, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details