తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇంగ్లాండ్​ జట్టు గుండె చప్పుడు బెన్ స్టోక్స్' - ప్రపంచకప్​

త్వరలో జరిగే యాషెస్​ సిరీస్​లో ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్ స్టోక్స్ కీలకం కానున్నాడని చెప్పాడు ఆసీస్ జట్టు సహాయ కోచ్ రికీ పాంటింగ్. ఆగస్టు 1 నుంచి ఈ మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి.

'ఇంగ్లాండ్​ జట్టు గుండె చప్పుడు బెన్ స్టోక్స్'

By

Published : Jul 25, 2019, 5:46 PM IST

ఇటీవలే ప్రపంచకప్​ గెలుచుకుంది ఇంగ్లాండ్. త్వరలో ఆస్ట్రేలియాతో యాషెస్ టెస్ట్ సిరీస్​ ఆడనుంది. ఈ సమయంలో స్పందించాడు ఆస్ట్రేలియా జట్టు సహాయ కోచ్ రికీ పాంటింగ్. ప్రత్యర్థి జట్టులోని ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​ కీలకమైన ఆటగాడని అన్నాడీ ఆసీస్ మాజీ క్రికెటర్. అతడ్ని మాజీ ఇంగ్లీష్​ క్రికెటర్​ ఆండ్రూ ఫ్లింటాఫ్​తో పోల్చాడు.

"బెన్ స్టోక్స్ ఇప్పుడు ఆటలో పరిణితి కనబరుస్తున్నాడు. ఇంతకు ముందులా కాకుండా క్లాస్​గా ఆడుతున్నాడు. ప్రపంచకప్​లో పరిస్థితులను అర్థం చేసుకుని, జట్టుకు ఏం కావాలో తెలుసుకుని అందుకు తగ్గట్లుగా ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​ జట్టులో అతడు కీలక ఆటగాడు. మాజీ ఆల్​రౌండర్​ ఫ్లింటాఫ్​లా కనిపిస్తున్నాడు. స్టోక్స్​ను అడ్డుకునేందుకు మేం ప్రణాళికలు రచిస్తున్నాం" -రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా సహాయ కోచ్

2017 బ్రిస్టల్​లో​ జరిగిన గొడవ కారణంగా కొన్ని నెలల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు బెన్​ స్టోక్స్. ఆ తర్వాత ఆటపై దృష్టి పెట్టి కీలక ఆటగాడిగా ఎదిగాడు. ప్రపంచకప్​లో తన వంతు పాత్ర పోషించి.. ఇంగ్లీష్ జట్టు తొలిసారి కప్పు గెలుచుకోవడంలో సహాయపడ్డాడు.

ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్

ఇంగ్లాండ్​ వేదికగా ప్రఖ్యాత యాషెస్ సిరీస్​ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. విజయం సాధించేందుకు ఇరుజట్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details