తెలంగాణ

telangana

ETV Bharat / sports

మా దృష్టంతా విదేశీయులపైనే: పాంటింగ్ - delhi capitols

ఐపీఎల్ వేలంపై అన్ని ఫ్రాంఛైజీలు దృష్టి సారించాయి. అయితే తమ చూపు విదేశీ పేసర్ల వైపే ఉందని, కొన్ని నెలలు ఈ అంశంపై చాలాసార్లు చర్చించామని చెప్పాడు దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్.

ponting on ipl auction represented as Delhi capitols
పాంటింగ్

By

Published : Dec 14, 2019, 3:20 PM IST

డిసెంబరు 19న నిర్వహించనున్న ఐపీఎల్‌ వేలంలో తమ దృష్టంతా విదేశీ పేసర్ల ఎంపికపైనే ఉంటుందని దిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. కొన్ని నెలలుగా వేలం గురించి తాము చాలాసార్లు చర్చించామని మీడియాతో తెలిపాడు.

ముందుగా మనమెన్ని ప్రణాళికలైనా వేసినా.. వేలం జరిగేటప్పుడు ఏం జరుగుతుందో మాత్రం అంచనా వేయలేం. మేం ఎక్కువగా ఫాస్ట్‌ బౌలర్లపైనే దృష్టి సారించాం. ప్రత్యేకించి విదేశీయులపై. ప్యాట్‌ కమిన్స్‌ భారీ ధర పలకొచ్చు. క్రిస్‌వోక్స్‌కూ ఆ అవకాశం ఉంది. నా ప్రకారం ఆల్‌రౌండర్లపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టొయినిస్‌, మిచెల్‌ మార్ష్‌, జిమ్మీ నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌ వంటి ఆటగాళ్ల ధర ఎక్కువే ఉంటుంది." -రికీ పాంటింగ్​, దిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్​.

జట్టులో ఉన్న లోటును పూడ్చుకోవాలని అన్నాడు పాంటింగ్

తుది పదకొండుకు సంబంధించి ఎక్కడ సమస్యలున్నాయో వాటిని పరిష్కరించుకోవాలి. లోటు పూడ్చుకోవాలి. చివరి సీజన్‌ సెమీస్‌లో చెన్నై చేతిలో ఓటమి బాధాకరం. ఐతే మేం సీజన్‌ సాంతం అద్భుతమైన క్రికెట్‌ ఆడాం. జట్టెంత సరదాగా గడిపిందో నాకు గుర్తుంది. అనుభవం ఉన్న రహానె, అశ్విన్‌ కోట్లా వికెట్‌పై ఉపయోగపడతారు - రికీ పాంటింగ్​, దిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్​

ప్రస్తుతం దిల్లీ వద్ద రూ.27.85 కోట్లు ఉన్నాయి. ఐదుగురు విదేశీయులు సహా 11 మందిని ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: వైరల్: ఈ విధంగా కూడా బౌలింగ్ చేస్తారా..!

ABOUT THE AUTHOR

...view details