తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్ చెత్త ప్రదర్శన చేస్తోంది: పాంటింగ్ - ఆసీస్​ చెత్త ప్రదర్శన రికీ పాంటింగ్​

రెండో టెస్టులో టీమ్​ఇండియా బౌలింగ్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్​. తమ జట్టు చెత్త ప్రదర్శన చేస్తోందని విమర్శించాడు.

ponting
పాంటింగ్​

By

Published : Dec 29, 2020, 6:51 AM IST

మెల్​బోర్న్​ పిచ్‌లో ఎలాంటి లోపాలూ లేవని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ఆతిథ్య జట్టు బ్యాటింగ్ అత్యంత‌ పేలవంగా ఉందన్నాడు. రెండో టెస్టులో టీమ్‌ఇండియా బౌలింగ్‌లో చెత్త షాట్లు ఆడారని విమర్శించాడు. ప్రస్తుతం ఈ పోరులో ఆసీస్‌ ఓటమివైపు పయనిస్తున్న సంగతి తెలిసిందే.

"పిచ్‌ను నిందించొద్దు. మూడో రోజు పిచ్‌ చాలా బాగుంది. బంతి కాస్త టర్న్‌ అవుతోంది. కానీ అది ఊహించతగిందే. ఎందుకంటే టెస్టులో మూడో రోజు ఇది. ఫాస్ట్‌ బౌలర్లకు కొంతే సహకరించింది. ఏదేమైనప్పటికీ ఆసీస్‌ది పేలవ బ్యాటింగే. బ్యాట్స్‌మెన్‌ వికెట్లు ఇవ్వడానికి కారణమిదే. చెత్త షాట్లు ఆడారు. క్రమం తప్పకుండా పరుగులు చేయలేదు. దాంతో ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి పెరిగిందంటే చెత్త షాట్లే కదా ఆడతారు" అని పాంటింగ్ అన్నాడు.

"అశ్విన్‌ బౌలింగ్‌లో ఆడిన విధానం గురించి తొలి ఇన్నింగ్స్‌లోనూ నేను మాట్లాడా. అతడిపై దూకుడుగా ఆడలేదు. నిజానికి అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కానీ కొన్నిసార్లు అత్యుత్తమ బౌలర్ల బౌలింగ్‌లోనూ రిస్క్‌ చేయాలి. భారత బౌలర్లు చెత్త బంతులు వేయలేదు. బుమ్రా, అశ్విన్‌, సిరాజ్‌, జడేజా పొరపాట్లు చేయలేదు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ తప్పులు చేసేలా వారు బంతులు విసిరారు. నిజానికి మంచి బౌలర్లు తప్పులు చేసేలా బ్యాట్స్‌మెన్‌ దాడి చేయాలి" అని పాంటింగ్‌ చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details