తెలంగాణ

telangana

ETV Bharat / sports

పొలార్డ్​కు పితృవియోగం.. సచిన్ సంతాపం - కీరన్ పొలార్డ్​

వెస్టిండీస్​ క్రికెటర్​ కీరన్ పొలార్డ్​ తండ్రి మరణించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు పొలార్డ్.

Pollard's father passes away, all-rounder says 'I do know you are in a better place'
పొలార్డ్​కు పితృవియోగం- సచిన్ సంతాపం

By

Published : Mar 24, 2021, 7:43 PM IST

వెస్టిండీస్​ స్టార్​ క్రికెటర్ కీరన్​ పొలార్డ్​ తండ్రి మృతి చెందారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు పొలార్డ్​. అతనితో పాటు తన తండ్రి కలిసి ఉన్న పలు ఫొటోలను అందులో షేర్​ చేసుకున్నాడు. 2019 ఐపీఎల్​ ట్రోఫీతో పొలార్డ్, అతని నాన్న కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగంతో క్యాప్షన్ జోడించాడు.

"శాంతియుతంగా, మనోహరంగా.. చాలా హృదయాలను, ఆత్మలను కదిలించారు. మున్ముందు మిమ్మల్ని గర్వించేలా చేస్తా. ఇకపై 'పొడవైన కుర్రాడు' లేరు. మీరు మంచి ప్రదేశంలో ఉన్నారని నాకు తెలుసు" అని పొలార్డ్​ ఆ ఫొటో కింద క్యాప్షన్ ఇచ్చాడు.

సచిన్ సంతాపం..

పొలార్డ్​ తండ్రి మృతి పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్​ సంతాపం ప్రకటించాడు. "మీ తండ్రి మరణం గురించి ఇప్పుడే తెలుసుకున్నా. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అని లిటిల్​ మాస్టర్​ ట్వీట్ చేశాడు. ​

ఇదీ చదవండి:ఓర్లీన్​ మాస్టర్స్​: సైనా, శ్రీకాంత్​ శుభారంభం

ABOUT THE AUTHOR

...view details