శ్రీలంకపై రెండో వన్డేలో గెలుపును తన అంకుల్ (మామ) స్టీవెన్‌కు అంకితమిచ్చాడు విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్. సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లను కరీబియన్ జట్టు గెలుచుకుంది. దీంతో సిరీస్‌నూ కైవసం చేసుకుంది పొలార్డ్ సేన.
"ఓ క్రికెటర్‌గా నాకొక క్లిష్టమైన రోజు. నేను క్రికెట్ ఆడటానికి కారణమైన వ్యక్తి.. అంకుల్ (మామ) స్టీవెన్.. ఈ రోజు ఉదయం చనిపోయారు. అతడికి ఈ సిరీస్ విజయాన్ని అంకితమిస్తున్నా."
-కీరన్ పొలార్డ్, విండీస్ కెప్టెన్.
"టీ20ల కంటే వన్డే సిరీస్‌లోనే మా ఆటగాళ్లు మంచి ప్రతిభ చూపారు. లూయిస్ అద్భుత శతకానికి తోడుగా.. షై హోప్ అర్థ సెంచరీతో రాణించాడు. జేసన్ మహమ్మద్ కూడా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. నికోలస్ పూరన్ మ్యాచ్‌ను ముగించాడు. మూడో వన్డే కూడా గెలిచి సిరీస్‌లో 3-0తో క్లీన్ స్వీప్ చేయాలి. ఏదేమైనా, ఈ విజయాన్ని స్టీవెన్ (అంకుల్)కు అంకితమిస్తున్నా" అని పొలార్డ్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:2020+5 ఒలింపిక్ అజెండాను ఆమోదించిన ఐఓసీ