కరీబియన్ ప్రీమియర్ లీగ్ ముగియడం వల్ల అందులో పాల్గొన్న ఆటగాళ్లు ఐపీఎల్ జట్లలో చేరుతున్నారు. స్టార్ ఆటగాడు కీరన్ పొలార్డ్ శనివారం ముంబయి ఇండియన్స్‌తో కలిశాడు. అతడితో పాటు షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ కూడా జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబయి ఫ్రాంచైజీ వెల్లడించింది.
ఈ నెల 10న కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ జరిగింది. సెయింట్ లూసియా జౌక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రింబాగో నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించింది. అదే ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు సారథి కీరన్ పొలార్డ్ అబుదాబికి చేరుకున్నాడు.