సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్.. 73వ పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ టోర్నీలో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటాడు. ఎంఐజీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. ఇస్లాం జింఖానాతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించాడు. 31 బంతుల్లో 77 పరుగులతో బాదడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును చిత్తుచేశాడు. అయిదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు సాధించాడు. స్పిన్నర్ హషీర్ వేసిన ఓ ఓవర్‌లో అయిదు సిక్సర్లు బాదడం గమనార్హం.
ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన సచిన్ తనయుడు - 73వ పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ టోర్నీలో సచిన్ తెందుల్కర్ తనయుడు
73వ పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ టోర్నీలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ అదిరే ప్రదర్శన చేశాడు. 31 బంతుల్లో 71 పరగులు చేయడమే కాదు, మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు.
అర్జున్‌తో పాటు కెవిన్ (96), ప్రగ్నేష్ (112) సత్తాచాటడంతో ఎంఐజీ జట్టు 45 ఓవర్లలో ఏడు వికెట్లకు 385 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ప్రత్యర్థి జట్టు 41.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ముంబయి క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ కరోనా విరామం తర్వాత ముంబయిలో జరిగిన తొలి క్రికెట్ పోటీగా నిలిచింది. అర్జున్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబయి తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గురువారం జరగనున్న ఐపీఎల్ వేలంలోనూ అతడు ఉన్నాడు.
ఇదీ చదవండి:టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జవాన్లు