తెలంగాణ

telangana

ETV Bharat / sports

చేతన్​ చౌహాన్​ మృతికి ప్రధాని, ఉపరాష్ట్రపతి సంతాపం - చేతన్​ చౌహాన్​కు మోదీ, వెంకయ్య నాయుడు సంతాపం

టీమ్ఇండియా మాజీ క్రికెటర్​, ఉత్తరప్రదేశ్​ మంత్రి చేతన్​ చౌహాన్​ మృతికి భారత ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ సోషల్​మీడియాలో నివాళులు అర్పించారు.

PM Narendra Modi and Vice President M Venkaiah Naidu condoled the death of  Uttar Pradesh minister and former cricketer Chetan Chauhan
చేతన్​ చౌహాన్​ మృతికి ప్రధాని, ఉపరాష్ట్రపతి సంతాపం

By

Published : Aug 16, 2020, 8:50 PM IST

ఉత్తరప్రదేశ్​ మంత్రి, మాజీ క్రికెటర్​ చేతన్ చౌహాన్​ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. క్రికెటర్​గా, రాజకీయ నాయకుడిగా చేతన్​ దేశానికి ఎంతో సేవ చేశారని.. అలాంటి వ్యక్తి అర్ధాంతరంగా మరణించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

"శ్రీ చేతన్​ చౌహాన్​.. ముందు అద్భుతమైన క్రికెటర్​గా, తర్వాత శ్రద్ధగల రాజకీయ నాయకుడిగా తనను తాను మల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్​లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం సహా ప్రజాసేవ కార్యక్రమాల్లో ముందు నిలిచారు. ఆయన మరణం ఎంతోక్షోభకు గురిచేసింది. చేతన్​ చౌహాన్​ కుటుంబానికి, మద్దతుదారులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఓం శాంతి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

"మాజీ క్రికెటర్​, ఉత్తరప్రదేశ్​ మంత్రి శ్రీ చేతన్​ చౌహాన్​ మృతి తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. భారత క్రికెట్​కు ఆయన ఎనలేని కృషి చేశారు. రెండు సార్లు పార్లమెంట్​ సభ్యుడిగానూ పని చేశారు. చేతన్​ చౌహన్​ కుటుంబానికి, అభిమానులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఓం శాంతి."

-వెంకయ్య నాయుడు​, ఉప రాష్ట్రపతి

కరోనా వైరస్​ సోకిన కారణంగా శరీర అవయవాలన్నీ పని చేయడంలో విఫలమయ్యాయని చౌహాన్​ సోదరుడు పుష్పేంద్ర చౌహాన్​ ప్రకటించారు. దీంతో ఆదివారం మాజీ క్రికెటర్​ మరణించాడని వెల్లడించారు.

చేతన్ చౌహాన్​.. టీమ్ఇండియా తరపున 40 టెస్టుల్లో 73 పరుగులు నమోదు చేశారు. ఆయనకు భార్య, కుమారుడు వినాయక్​ ఉన్నారు. చేతన్​.. ఉత్తరప్రదేశ్​ క్యాబినేట్​లో సైనిక వెల్ఫేర్​, హోమ్​ గార్డ్స్​, పీఆర్​డీ, సివిల్​ సెక్యూరిటీ దస్త్రాల మంత్రిత్వశాఖకు బాధ్యతలు వహిస్తూ.. తుదిశ్వాస విడిచారు.

ABOUT THE AUTHOR

...view details