ఆదివారం జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్, స్టార్ షట్లర్ పీవీ సింధు, ప్రపంచకప్లో అదరగొట్టిన మహిళ షూటర్లపై ప్రశంసలు కురిపించారు.
'మన్ కీ బాత్': మిథాలీ, సింధుపై మోదీ ప్రశంసలు - Mann ki Baat latest episode
ఈ ఏడాది జరిగిన మూడో 'మన్ కీ బాత్'లో భారత మహిళ క్రీడాకారులను మెచ్చుకున్నారు. మిథాలీ రాజ్, పీవీ సింధులను అభినందించారు.
"మార్చిలో మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నాం. ఇదే నెలలో ఎందరో మహిళా క్రీడాకారులు పలు రికార్డులు సృష్టించడం సహా పతకాలనూ సాధించారు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. స్వర్ణాలు ఎక్కువగా సొంతం చేసుకుంది" అని ప్రధాని మోదీ వెల్లడించారు.
ఇటీవల వన్డేల్లో 10 వేల పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్గా మిథాలీ రాజ్ నిలిచింది. ఆమె ఆ ఘనత సాధించినందుకు మోదీ అభినందనలు తెలిపారు. స్విస్ ఓపెన్లో సత్తాచాటిన షట్లర్ పీవీ సింధు రజతం గెల్చుకున్నవిషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.