తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెటర్​ భార్య కోసం స్వయంగా వండిపెట్టిన ప్రధాని​ - cricket news

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా...  స్టార్ ఆల్​రౌండర్ షకీబ్ అల్ హాసన్ భార్య కోసం​ స్వయంగా కొన్ని పదార్థాలు వండి, వారి ఇంటికి పంపించారు. ఈ విషయాన్ని ఫేస్​బుక్ వేదికగా పంచుకున్నాడీ క్రికెటర్.

PM Hasina cooks meal for Shakib's wife
షకీబ్ అల్ హాసన్ భార్య కోసం స్వయంగా వండిపెట్టిన ప్రధాని​

By

Published : Jan 27, 2020, 1:15 PM IST

Updated : Feb 28, 2020, 3:23 AM IST

బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్​.. ఆనందం పట్టలేకపోతున్నాడు. తను అద్భుతమైన భోజనం రుచి చూశానని, ఈ ఆతిథ్యం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందన్నాడు. అయితే ఇక్కడ అతడి కుటుంబం కోసం వండింది సాదాసీదా వ్యక్తి కాదు. ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా. ఈ విషయాన్ని మొత్తం తన ఫేస్​బుక్​లో రాసుకొచ్చాడు.

అసలేం జరిగింది?

బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా ఇంటికి కొద్దిరోజుల క్రితం షకిబ్ భార్య వెళ్లింది. ఆమె అక్కడే భోజనం చేసింది. ఆ సమయంలో ఆమె కొన్ని పదార్థాలను ఇష్టంగా తినడం చూసిన హసీనా.. ఆ విషయం గుర్తుంచుకున్నారు. వాటిని స్వయంగా వండి, షకిబుల్​ ఇంటికి ఆదివారం ఉదయం పంపించారు. ఆశ్చర్యపోయిన షకిబ్.. తన ఆనందాన్ని ఫేస్​బుక్ వేదికగా పంచుకున్నాడు. సంబంధిత ఫొటోలను పోస్ట్ చేశాడు.

షకీబ్ అల్ హాసన్ భార్య కోసం స్వయంగా వండిపెట్టిన ప్రధాని​

ప్రధాని హసీనా వేరొకరికి వండిపెట్టడం ఇదేం కొత్తం కాదు. 2017లో ఆమె దిల్లీ సందర్శించినపుడు అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోసం హిల్సా అనే వంటకాన్ని తయారు చేశారు.

Last Updated : Feb 28, 2020, 3:23 AM IST

ABOUT THE AUTHOR

...view details