తెలంగాణ

telangana

ETV Bharat / sports

పరిస్థితుల్ని అర్థం చేసుకుని వ్యవహరించండి: కోహ్లీ - పరిస్థితుల్ని అర్థం చేసుకుని వ్యహరించండి: కోహ్లీ

కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్​డౌన్​ను చాలా మంది ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయంపై టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేస్తూ ఓ వీడియో షేర్ చేశాడు.

కోహ్లీ
కోహ్లీ

By

Published : Mar 27, 2020, 6:47 PM IST

కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రజలందరూ స్వీయనిర్బంధాన్ని కచ్చితంగా పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కానీ చాలామంది దీనిని సీరియస్​గా తీసుకోవట్లేదు. చాలా రాష్ట్రాల్లో రోడ్లపై తిరుగుతూ కనిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలిబ్రిటీలు ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ వీడియోలు రూపొందించారు. తాజాగా టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ మరోసారి ప్రజలకు ఓ సందేశం విన్నవించాడు.

"హలో. నేను విరాట్ కోహ్లీ. నేను ఈరోజు మీతో ఓ క్రికెటర్​గా మాట్లాడట్లేదు. బాధ్యతగల భారతీయ పౌరుడిగా మాట్లాడుతున్నా. చాలా రోజులుగా నేను గమనించిందేంటంటే కొంతమంది గుంపులుగుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. కర్ఫ్యూ రూల్స్​ను పాటించట్లేదు. లాక్​డౌన్ మార్గదర్శకాలను పెడచెవిన పెడుతున్నారు. దీనిని బట్టి చూస్తే మనం దీనిని తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కానీ మనం అనుకున్నంత తేలికగా లేవు పరిస్థితులు. దీనిని గమనించాలి. ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించాలి. ప్రభుత్వం చెబుతున్న సూచనల్ని తప్పకుండా పాటించాలి. లేదంటే మీతో పాటు మీ కుటుంబం కూడా వైరస్ బారిన పడుతుంది. ఇప్పటికైనా మార్గదర్శకాలను పాటిస్తే దేశం బాగుకోరిన వారమవుతాం. జైహింద్."

-విరాట్ కోహ్లీ, టీమ్​ఇండియా సారథి

ఇంతకుముందు కూడా కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కోరాడు.

ABOUT THE AUTHOR

...view details