సెంట్రల్ కాంట్రాక్టు పొందని క్రికెటర్లు విదేశీ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతివ్వాలని క్రికెటర్ రాబిన్ ఉతప్ప విజ్ఞప్తి చేశాడు. ఒక స్థాయిలో సుదీర్ఘకాలం ఆడి మళ్లీ దేశవాళీకి వెళ్లాలంటే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నాడు. మానసికంగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించాడు.
"దయచేసి మమ్మల్ని (విదేశీ టీ20 లీగులకు) వెళ్లనివ్వండి. ఎందుకంటే, సుదీర్ఘకాలం ఒక స్థాయిలో క్రికెట్ ఆడి మళ్లీ దేశవాళీకి వెళ్లాలంటే సమయం పడుతుంది. ప్రపంచంలోని ఇతర లీగుల్లో ఆడేందుకు అనుమతించకపోతే ఆటగాళ్లకు బాధేస్తుంది. రెండు, మూడు విదేశీ లీగులు ఆడితే బాగుంటుంది. ఒక క్రికెట్ విద్యార్థిగా నేర్చుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి" అని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.