మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో కనిపించి చాలా కాలమైంది. ఇటీవలే పునరాగమనం గురించి మాట్లాడిన మహీ.. జనవరి వరకు తననేం అడగొద్దని అన్నాడు. అయితే వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడతాడా? లేదా? అంటూ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని మీడియా ప్రశ్నించింది. ఆదివారం జరిగిన 88వ బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా.. ఈ విషయం గురించి ధోనీనే అడగమని దాదా అన్నాడు.
ఆ విషయం ధోనీనే అడగండి: గంగూలీ - dhoni latest news
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడతాడా? లేదా? అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని అడగ్గా, ఈ విషయం ధోనీనే అడగండంటూ కూల్‌గా సమాధానమిచ్చాడు దాదా.
ఆ విషయం ధోనినే అడగండి:గంగూలీ
ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ తర్వాత మహీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. రెండు నెలలు సైన్యంలో పనిచేశాడు. ఆ తర్వాత ఇంటి దగ్గరే ఉన్నా, జట్టుకు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. మరి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.
ఇదీ చూడండి : తమిళనాడులో భాజపాలోకి ప్రముఖ నటుల వలసలు