కరోనా నేపథ్యంలో క్రీడా టోర్నీల నిర్వహణ ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నారు నిర్వాహకులు. ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే అలాంటి మ్యాచ్‌లు అస్సలు మజా ఉండవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.
"ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడటం వల్ల క్రికెట్ బోర్డులకు మేలు జరగవచ్చు. అయితే, ఇది అంతగా ఆకట్టుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ ఆడటం వధువు లేని పెళ్లిలాంటిది. ఆటలు ఆడాలంటే స్టేడియం ప్రేక్షకులతో నిండిపోవాలి. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఏడాదిలో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అనుకుంటున్నా."