ఇకపై అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే కనీసం 15 ఏళ్లు ఉండాల్సిందే. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఆడే ప్రతి ఆటగాడికి 15 ఏళ్లు దాటి ఉండాలని ఓ ప్రకటనలో తెలియజేసింది.
"ఐసీసీ ఈవెంట్స్, ద్వైపాక్షిక క్రికెట్, అండర్-19 టోర్నీలతో సహా క్రికెట్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌ల్లో ఆటగాళ్లకు కనీస వయోపరిమితులను ప్రవేశపెట్టేందుకు బోర్డు ధ్రువీకరించింది. పురుషుల, మహిళల లేదా అండర్-19 స్థాయిలో ఆడే ప్రతి క్రికెటర్ తప్పకుండా 15 ఏళ్లు నిండి ఉండాలి. ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే జాతీయ జట్టులో ఆడించేందుకు ఆ దేశ బోర్డు తప్పనిసరిగా ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది"