ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను న్యూజిలాండ్‌లో జరపాలని సలహా ఇచ్చాడు మాజీ క్రికెటర్ డీన్ జోన్స్. కివీస్ ప్రధానమంత్రి జెసిండా అర్డెర్న్.. భౌతిక దూరం మార్గదర్శకాలను సులభతరం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జోన్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'న్యూజిలాండ్‌లో టీ20 ప్రపంచకప్ జరపండి'
టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. టోర్నీని న్యూజిలాండ్‌లో జరపాలని సూచించాడు ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్.
మాజీ క్రికెటర్ డీన్ జోన్స్
షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18- నవంబరు 15 మధ్య టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చి నుంచి అన్ని క్రీడలు నిలిచిపోయాయి. ఈ టోర్నీ విషయంలోనూ జూన్ 10లోపు నిర్ణయం తీసుకుంటామని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వెల్లడించింది. అయితే టీ20 ప్రపంచకప్‌ను 2022కు వాయిదా వేశారని, గత కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్‌లు జరిగేది సందేహంగా మారింది.