సిడ్నీలో గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపించిన సమయంలో టీమ్ఇండియా(హైదరాబాద్) పేసర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. అయితే తాను కన్నీటి పర్యంతం అవ్వడానికి గల కారణాన్ని మ్యాచ్ ముగిసిన అనంతరం వివరించాడు సిరాజ్. చనిపోయిన తన తండ్రి గుర్తుకురావడం వల్లే తాను ఏడ్చినట్లు తెలిపాడు.
"మా నాన్న గుర్తుకురావడం వల్లే నేను భావోద్వేగానికి గురయ్యా. నేను టెస్టు క్రికెట్ ఆడటం చూడాలని అయన ఎప్పుడూ తపన పడేవారు. ఒకవేళ ఆయన ఉండి ఉంటే తప్పకుండా నా ఆట చూసేవారు. ఈ రోజు నేను టెస్టుల్లో ఆడే సమయానికి ఆయన లేకపోవడం చాలా బాధగా ఉంది"
-సిరాజ్, టీమ్ఇండియా పేసర్