తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీపై పిచ్చి అభిమానం.. ఒళ్లంతా పచ్చబొట్ల మయం - Virat Fan Tattoo

ఒడిశాకు చెందిన పింటూ బెహరా.. స్టార్ క్రికెటర్ కోహ్లీపై అభిమానాన్ని విభిన్న రీతిలో చాటుకున్నాడు. ఒంటిపై 16 చోట్ల.. విరాట్​కు సంబంధించిన పచ్చబొట్లు పొడిపించుకున్నాడు.

Pintu Behera, a fan of Indian skipper Virat Kohli has inked 16 tattoos of the skipper,including Kohli's Jersey No. 18,on his body.
విరాట్ కోహ్లీ

By

Published : Dec 22, 2019, 8:42 AM IST

Updated : Dec 22, 2019, 8:49 AM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమానులు చాలా ఎక్కువ. ఇంతకు ముందు అతడిపై అభిమానాన్ని చాటుతూ ఓ పాకిస్థానీయుడు.. భారత జాతీయ పతాకాన్ని ఎగరేసిన ఘటన చూశాం. ఈ రకంగా వినూత్న రీతిలో కోహ్లీ కోసం పరితపిస్తున్న వారు చాలామంది. తాజాగా ఓ వ్యక్తి ఒంటిపై విరాట్ బొమ్మను పచ్చబొట్టు పొడిపించుకొన్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 16 పచ్చబొట్లు వేయించుకున్నాడు.

పింటూ బెహెరా పచ్చబొట్లు

ఒడిశాలోని కటక్​కు చెందిన పింటూ బెహరాకు విరాట్ కోహ్లీ అంటే విపరీతమైన ఇష్టం. అతడిపై అభిమానాన్ని చాటుతూ.. ఒంటిపై వివిధ ప్రదేశాల్లో కోహ్లీ పేరు, జెర్సీ నెంబర్ 18తో సహా 16 పచ్చబొట్లు పొడిపించుకున్నాడు.

పింటూ బెహెరా పచ్చబొట్లు

"నేను విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానిని కావాలనుకుంటున్నా. నాకు అతడి ఆట తీరంటే ఎంతో ఇష్టం. అందుకే అతడిపై నా గౌరవాన్ని ఈ విధంగా చాటుకుంటున్నా" -పింటూ బెహరా, విరాట్ అభిమాని

కటక్‌లో నేడు(ఆదివారం) వెస్టిండీస్‌తో భారత్‌ నిర్ణయాత్మక మూడో వన్డే ఆడనుంది. ఈ సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి మ్యాచ్​లో విండీస్‌, రెండో దానిలో కోహ్లీసేన విజయం సాధించింది. ఆఖరి పోరులోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

ఇదీ చదవండి: ఓ మ్యాచ్​ గెలిస్తే మేరీతో నిఖత్ ఢీ

Last Updated : Dec 22, 2019, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details