భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. ఈడెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టులో.. శతకం నమోదు చేశాడు. ఓవర్‌నైట్ స్కోరు 59 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన కోహ్లీ... 159 బంతుల్లో 12 ఫోర్లతో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఇది కోహ్లీకి టెస్టుల్లో 27వ సెంచరీ. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70వ శతకం. ఇందులో 43 వన్డే సెంచరీలు ఉన్నాయి.
సచిన్ రికార్డుపై కన్ను...
తాజాగా 27వ టెస్టు సెంచరీ ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. వేగంగా ఈ రికార్డును అందుకున్న రెండో ఆటగాడిగా సచిన్ సరసన నిలిచాడు. 141 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు విరాట్. బ్రాడ్‌మన్ 70 ఇన్నింగ్స్‌ల్లోనే 27 సెంచరీలు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. 31 ఏళ్ల కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 70 సెంచరీలు చేసిన (439 ఇన్నింగ్స్‌ల్లో) తొలి బ్యాట్స్‌మన్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. సచిన్ 505 ఇన్నింగ్స్‌లు, ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 649 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు అందుకుని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.