తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గులాబి' టెస్టులో రెండు రోజుల టికెట్ల సొమ్ము వాపసు

భారత్ ఆడిన తొలి డేనైట్ టెస్టు.. మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు రోజుల టికెట్ల సొమ్మును వాపసు ఇవ్వాలని బంగాల్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. ఈ మ్యాచ్​లో టీమిండియా.. ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

పింక్ టెస్టు

By

Published : Nov 25, 2019, 4:43 PM IST

కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్ వేదికగా జరిగిన డేనైట్ టెస్టు కోసం నాలుగు రోజుల టిక్కెట్లు ముందుగానే అమ్ముడపోయాయి. ఐదో రోజుకు సంబంధించిన టికెట్లను కొంతమేర విక్రయించింది బంగాల్ క్రికెట్ సంఘం(క్యాబ్). అయితేమ్యాచ్ 3 రోజుల్లోనే పూర్తయి, బంగ్లాదేశ్​పై టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ కారణంగా మిగిలిన రెండు రోజుల టికెట్ల సొమ్మును తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది.

క్రికెట్ అభిమానులకు ఈ విధంగా సొమ్ము తిరిగి ఇవ్వడం చాలా అరుదు. సాధారణంగా రాష్ట్రాల క్రికెట్ బోర్డులు మ్యాచ్​లు నిర్వహించినపుడు మిగిలిన రోజుల టికెట్ల మొత్తాన్ని తిరిగి ఇస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ రద్దయినపుడు లేదా ఆగిపోయినపుడు మాత్రమే సొమ్మును వాపసు చేస్తారు.

బంగ్లాతో జరిగిన ఈ టెస్టులో భారత్.. ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్​లో ఇషాంత్ 5 వికెట్లతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్​లో ఉమేశ్ విజృంభిచాడు. కెప్టెన్ కోహ్లీ 136 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టీమిండియా ఆడిన మ్యాచ్​ల్లో, అతి తక్కువ బంతులే(161.2) బౌలింగ్ చేసిన టెస్టుగా ఈ గులాబి మ్యాచ్ మిగిలిపోయింది. 2018లో అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఇరుజట్లు కలిసి 171.2 ఓవర్లు ఆడాయి.

ఇదీ చదవండి: కోహ్లీపై గావస్కర్ అసహనం.. ఏం జరిగిందంటే..!

ABOUT THE AUTHOR

...view details