డేనైట్ టెస్టులో చారిత్రక విజయం సాధించిన భారత్ అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. వరుసగా ఏడో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఇన్నింగ్స్ తేడాతో వరుసగా నాలుగో గెలుపునూ కైవసం చేసుకుంది టీమిండియా.
బోర్డర్ రికార్డు బద్దలు..
అత్యధిక విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో విరాట్ 5వ స్థానంలో నిలిచాడు. 33 విజయాలతో అలెన్ బోర్డర్(32) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో గ్రేమ్ స్మిత్(53) అగ్రస్థానంలో నిలిచాడు.
- గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా)- 53 విజయాలు
- రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా) - 48
- క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్) - 36
- విరాట్ కోహ్లీ(భారత్) - 33*
- అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) - 32
బలమైన పేస్ దళం..
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక బలమైన పేస్ దళం ఉన్న జట్టుగా టీమిండియా నిలిచింది. స్పిన్నర్లు వికెట్లేమీ తీయకుండా టెస్టు విజయం సాధించడం ఇది రెండో సారి మాత్రమే. 2018లో జోహన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాపై మ్యాచ్ ఒకటి కాగా.. ప్రస్తుతం కోల్‌కతా వేదికగా జరిగిన డే నైట్ టెస్టు రెండోది. 2017-18లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా స్పిన్నర్లు వికెట్లేమి తీయలేదు. అయితే ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సొంతగడ్డపై ఇలా జరగడం ఇదే మొదటిసారి.