కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాతో జరుగుతోన్న రెండో టెస్టులో.. భారత ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌ను 347/9 వద్ద డిక్లేర్ చేసిన కోహ్లీసేన.. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లోనూ కట్టడి చేసింది. 32.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 152 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ముగించింది బంగ్లా. ప్రస్తుతం 89 పరుగుల వెనుకంజలో ఉండగా.. ముష్ఫికర్ రహీమ్ అర్ధశతకంతో నాటౌట్‌గా కొనసాగుతున్నాడు.
కోహ్లీ అదరహొ...
ఓవర్‌నైట్ స్కోర్ 174/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా... దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ అజింక్య రహానే(51; 69 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రహానేకి ఇది 22వ అర్ధ శతకం. అనంతరం రహానే(51) తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫలితంగా కోహ్లీ, రహానే 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. తైజుల్ ఇస్లామ్ వేసిన 68 ఓవర్ మూడో బంతికి రెండు పరుగులు తీసిన విరాట్... 159 బంతుల్లో 12 ఫోర్లు సాయంతో సెంచరీ సాధించాడు.
- టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా మొత్తంగా 70వ శతకం. ఇప్పటి వరకు తెలుపు, ఎరుపు బంతులతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన కోహ్లీ పింక్ బాల్ టెస్టులోనూ శతకంతో చెలరేగాడు. ఫలితంగా భారత్‌లో జరిగిన తొలి డేనైట్ టెస్టులో తొలి సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
(2011లో అబుదాబి వేదికగా ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఎమ్‌సీసీ, నాటింగ్‌హామ్‌షైర్ మ్యాచ్ జరిగింది. ఇందులో పింక్ బంతిని పరీక్షించారు. ఎమ్‌సీసీ తరఫున బరిలోకి దిగిన ద్రవిడ్ ఈ మ్యాచ్‌లో శతకం చేశాడు.)
136 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఆరో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ ఔటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. వరుస ఓవర్లలో అశ్విన్ (9), ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు డకౌటయ్యారు.
డకౌట్ల లిస్టులో...