సంప్రదాయ ఎరుపు బంతికి భిన్నంగా పింక్ బాల్‌తో టీమిండియా పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, జింబాబ్వే... ఈ గులాబి బంతి మజాను ఆస్వాదించగా, భారత్-బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు 11 డే/నైట్ మ్యాచ్‌లు జరగ్గా ఒక్కటీ.. డ్రా కాకపోవడం విశేషం. ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది.
పింక్ బంతితో.. ప్రతాపం చూపిన దేశాలివే గులాబి టెస్టుల ఫలితాలు
శ్రీలంక.. మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఈ మూడు మ్యాచ్‌లూ ఉపఖండం బయట జరగడం విశేషం. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చెరో మ్యాచ్ గెలిచి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్ మాత్రం ఆడిన మూడు మ్యాచ్‌లనూ ఓడి, చివరి స్థానంలో నిలిచింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మరికాసేపట్లో ఈ చారిత్రక టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకోసం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ను ఇప్పటికే ముస్తాబు చేశారు. మొదటి మూడు రోజులు.. రోజుకు దాదాపు 65 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు.
ఇదీ చదవండి: 'బంతి ఏదైనా.. పిచ్ ఎలాంటిదైనా.. షమి ప్రమాదకారే'