తెలంగాణ

telangana

ETV Bharat / sports

పింక్ బంతులు.. పైనుంచి రానున్నాయి..! - pink bal in auir

ఈడెన్ గార్డెన్స్​ వేదికగా జరగనున్న డే అండ్ నైట్ టెస్టులో పింక్ బంతులు గాల్లోంచి రానున్నాయి. టాస్‌కు ముందు సైన్యానికి చెందిన సిపాయిలు ప్యారాచూట్ల ద్వారా ఎగురుతూ వచ్చి  కెప్టెన్లకు గులాబీ బంతులు అందించేలా ఏర్పాట్లు చేయనుంది బంగాల్ క్రికెట్ సంఘం(క్యాబ్).

పింక్ బంతి

By

Published : Nov 17, 2019, 7:55 AM IST

Updated : Nov 17, 2019, 9:53 AM IST

ఇరు జట్ల కెప్టెన్లు టాస్‌కు సిద్ధంగా ఉన్నారు.. అదే సమయంలో ఆకాశంలో నుంచి ఇద్దరు సైనికులు ప్యారాచూట్ల సాయంతో ఎగురుతూ వచ్చి ఆ సారథులకు బంతులు అందిస్తే..? చూడ్డానికి ఎంతో బాగుంటుంది కదా! ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టీమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య శుక్రవారం ఆరంభమయ్యే డే అండ్​ నైట్‌ టెస్టులో ఇదే దృశ్యం చూసే అవకాశముంది.

భారత్‌లో తొలిసారి నిర్వహిస్తున్న డేనైట్‌ టెస్టు కోసం బంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. టాస్‌కు ముందు సైన్యానికి చెందిన సిపాయిలు ఎగురుతూ వచ్చి కెప్టెన్లకు గులాబి బంతులు అందించేలా ఏర్పాట్లు చేయనుంది. ఈ విషయమై ఇప్పటికే సైన్యానికి చెందిన అధికారులతో మాట్లాడినట్లు క్యాబ్‌ కార్యదర్శి అవిషేక్‌ దాల్మియా తెలిపాడు.

ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్​పై భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కోల్​కతా ఈడెన్​గార్డెన్స్ వేదికగా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్​ జరగనుంది. ఇరు జట్లు తొలిసారి గులాబి బంతితో ఆడనున్నాయి.

ఇదీ చదవండి: టీ20 తరహాలోనే '100 బంతుల క్రికెట్​​'కు ఆదరణ: యువీ

Last Updated : Nov 17, 2019, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details