తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కంకషన్' విషయమై సెహ్వాగ్ అలా.. సంజయ్ ఇలా - sanjay manjrekar sehwag

భారత్-ఆస్ట్రేలియా తొలి టీ20లో 'కంకషన్​ సబ్​స్టిట్యూట్​' వినియోగం మాజీల మధ్య చర్చకు దారితీసింది. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. భారత్​ నిర్ణయం సరైనదని సెహ్వాగ్​ చెప్పగా, ఓ నిబంధనను అతిక్రమించారని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.

Physio not coming out after Jadeja: Manjrekar.. Indians were right as concussion symptoms: sehwag
'కంకషన్' గురించి సెహ్వాగ్ అలా.. సంజయ్ ఇలా

By

Published : Dec 4, 2020, 9:59 PM IST

కంకషన్ సబ్​స్టిట్యూట్​ విషయంలో మాజీలు వీరేందర్ సెహ్వాగ్, సంజయ్​ మంజ్రేకర్​ తలో విధంగా మాట్లాడుతున్నారు. టీమ్​ఇండియా అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుందని వీరూ చెప్పాడు. కంకషన్​ ఉపయోగించుకునే విషయంలో కోహ్లీసేన ఓ నిబంధనను అతిక్రమించిందంటూ సంజయ్ తెలిపాడు.

ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. జడేజాకు కంకషన్​ సబ్​స్టిట్యూట్​గా వచ్చిన చాహల్.. మూడు వికెట్లు తీసి గెలుపునకు కారణమయ్యాడు.

కంకషన్​ విషయంలో భారత్​ నిర్ణయమే కరెక్ట్: సెహ్వాగ్

"జడేజా కంకషన్​ విషయంలో మన జట్టు సరైన నిర్ణయమే తీసుకుంది. జడేజా ఆడేందుకు, బౌలింగ్ చేయడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే బంతి హెల్మెట్​ను తాకగానే కంకషన్​ జరిగిందని ఎవరూ చెప్పలేరు. ఆ లక్షణాలు కనిపించడానికి 24 గంటలు పట్టొచ్చు. కాబట్టి కోహ్లీసేన అవకాశాన్ని సరైన సమయంలోనే ఉపయోగించుకుంది. ఆస్ట్రేలియా జట్టు ఈ విషయంలో ఫిర్యాదు చేయడానికి లేదు. ఎందుకంటే ఈ నియమాన్ని మొదటగా ఉపయోగించింది వాళ్లే కదా!" అని సెహ్వాగ్ వెల్లడించాడు.

టీమ్​ఇండియా ఆ నిబంధన అతిక్రమించింది: సంజయ్

"కంకషన్​ విషయంలో మ్యాచ్​ రిఫరీ టీమ్​ఇండియా వైపే ఉండొచ్చు కానీ మన జట్టు ఓ నిబంధనను అతిక్రమించింది. హెల్మెట్​కు బంతి తాకిన వెంటనే ఆ బ్యాట్స్​మన్​తో ఫిజియో కొంచెం సేపు ఉండాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. కొంతసేపు తర్వాత జడేజా యథావిధిగా బ్యాటింగ్ చేసేశాడు. చాహల్-జడేజా విషయంలో నాకు ఎలాంటి సమస్య లేదు. బంతి తగిలిన వెంటనే డాక్టర్, ఫిజియో రాకపోవడమే నిబంధన అతిక్రమణ కిందకు వస్తుంది" అని సంజయ్ మంజ్రేకర్ చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details