ఆన్లైన్ జూదాన్ని ప్రమోట్ చేస్తున్నారని టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ, హీరోయిన్ తమన్నాలపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పలు యాప్‌ల ద్వారా యువత ఆన్లైన్ జూదానికి బానిసగా మారుతున్నారని చెన్నైకి చెందిన న్యాయవాది తెలిపారు. కోహ్లీ, తమన్నాలతో ప్రమోషన్లు చేయించిన సదరు కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టుకు నివేదించారు.
మద్రాస్ హైకోర్టులో కోహ్లీ, తమన్నాలపై పిటిషన్! - kohli online gambling
ఆన్లైన్లో జూదం యాప్‌లకు యువత చెడిపోతున్నారని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు ఓ న్యాయవాది. వాటికి ప్రచారం చేస్తున్న కోహ్లీ, తమన్నాలతో పాటు సదరు సంస్థలపై పిటిషన్ దాఖలు చేశారు.
మద్రాస్ హైకోర్టులో కోహ్లీ, తమన్నాలపై పిటిషన్!
జూదం యాప్‌ల వల్ల ఏ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, అప్పుతీసుకున్న డబ్బును చెల్లించడంలేదనే విషయాలను కోర్టుకు తెలపడంలో పిటిషనర్ విఫలమయ్యారు. దీంతో కోర్టు ఈ కేసును ఆగస్టు 4కు వాయిదా వేసింది.
స్టార్ క్రికెటర్ కోహ్లీ.. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. త్వరలో జరగబోయే ఐపీఎల్లో పాల్గొనున్నాడు. సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.
Last Updated : Jul 31, 2020, 6:17 PM IST