తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అతడి బ్యాటింగ్​ చూస్తే సచిన్​ను మర్చిపోతారన్నాడు' - DHONI NEWS

సహచర క్రికెటర్ తన్వీర్ అహ్మద్ గతంలో, ధోనీని తనకు పరిచయం చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు​ పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్. సచిన్ పోల్చుతూ చెప్పడం వల్ల తాను తొలుత నమ్మలేదని అన్నాడు. ​

'అతడి బ్యాటింగ్​ చూస్తే సచిన్​ను మర్చిపోతారు'
సచిన్-మహేంద్ర సింగ్ ధోనీ

By

Published : Sep 4, 2020, 1:43 PM IST

Updated : Sep 4, 2020, 1:54 PM IST

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ప్రస్తుత తరంలో ఇతడి ప్రత్యేకతే వేరు. కెప్టెన్​గా, బ్యాట్స్​మన్​గా, ఫినిషర్​గా తనదైన ముద్ర వేశాడు. వాటిని అందుకోవాలన్నా, అధిగమించాలన్నా సరే ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాకపోవచ్చేమో!

ధోనీ కెప్టెన్సీలోనే భారత్.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్​, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెల్చుకోవడం సహా 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లోనూ అగ్రస్థానం సొంతం చేసుకుంది.

గతంలో తన సహచర క్రికెటర్ తన్వీర్ అహ్మద్, ధోనీ గురించి​ తనకు ఫోన్ కాల్​లో చెప్పిన ఆసక్తికర విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్.

2004లో శ్రీలంకతో మ్యాచ్​ సందర్భంగా ధోనీ

"2004లో కెన్యా పర్యటనలో ఉన్న తన్వీర్​ అహ్మద్ నాకు చెప్పిన విషయం బాగా గుర్తుంది. అప్పుడు నేను ఇంగ్లాండ్​లో ఉన్న కారణంగా ఫోన్​లో మాట్లాడాను. 'రషీద్ భాయ్.. సచిన్​ను మర్చిపోయేలా చేసే ఓ క్రికెటర్​ వచ్చాడు అని అన్నాడు'. 'అది అసాధ్యం, సచిన్ సచినే.. అలాంటి ఆటగాడిని ఎలా మర్చిపోగలం' అని నేను బదులిచ్చాను" -రషీద్ లతీఫ్, పాక్ మాజీ కెప్టెన్

2004 డిసెంబరులో బంగ్లాదేశ్​ వన్డేతో 23 ఏళ్ల వయసులో ధోనీ కెరీర్ ప్రారంభించాడు. తర్వాతి ఏడాది విశాఖపట్నంలోని పాకిస్థాన్ వన్డేలో​ తొలి సెంచరీ(148) నమోదు చేసి వెలుగులోకి వచ్చాడు. తర్వాత సంవత్సరం జైపుర్​లో శ్రీలంకపై అజేయంగా 183 పరుగులు చేసి, వన్డేల్లో తన అత్యధిక స్కోరు చేశాడు. 2006లో పాకిస్థాన్​పై తొలి టెస్టు శతకం(148) సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో పాల్గొనడంలో భాగంగా దుబాయ్​లో ఉన్నాడు మహీ.

Last Updated : Sep 4, 2020, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details