ఇర్ఫాన్ పఠాన్.. రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెడుతుంటాడు. ఆల్‌రౌండర్‌గా అరంగేట్రం చేసి అనతి కాలంలోనే స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. ఒకానొక దశలో కపిల్‌దేవ్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకుని అనంతరం కనుమరుగయ్యాడు. శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన ఈ 35ఏళ్ల క్రికెటర్.. జాతీయ జట్టులోకి రాలేనని 2016లోనే అనిపించిందని చెప్పాడు.
"2016-17 సీజన్లో బరోడ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన వారిలో 3వ స్థానంలో నిలిచా. అయితే సెలక్టర్లు నన్ను జాతీయ జట్టులోకి ఎంపికచేయలేదు. నా బౌలింగ్ పట్ల వాళ్లు అంత సంతృప్తికరంగా లేరు. మంచి ప్రదర్శన చేసినా.. ఫలితాలు రాబట్టినా జట్టులోకి ఎంపిక చేయకపోతే ఎలా ఉంటుంది. అప్పుడే అనిపించింది నా సమయం ముగిసిందని.. ఇంక జట్టులోకి రాలేనని." - ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా మాజీ క్రికెటర్.
2016లోనే రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నానని, అయితే కుదరలేదని తెలిపాడు ఇర్ఫాన్.
"అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలకాలని 2016లోనే అనుకున్నా. అయితే కొన్ని లీగ్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం వచ్చింది. జమ్ము కశ్మీర్ క్రికెట్‌కు మార్గనిర్దేశకుడిగా ఉంటూ.. వారితో ఆడాల్సి వచ్చింది. వారితో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. అందుకే అప్పుడు రిటైర్మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నా వయసు 35, ఇంకో 5 ఏళ్లు అడపాదడపా ఆడతాననుకుంటున్నా." -ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా మాజీ క్రికెటర్.