తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మైదానంలో ఆటగాళ్ల మధ్య విభేదాలు సాధారణమే' - జోస్ బట్లర్

అహ్మదాబాద్​ వేదికగా జరిగిన ఐదో టీ20లో భారత కెప్టెన్ కోహ్లీ, ఇంగ్లాండ్ వికెట్​ కీపర్​ బట్లర్​ మధ్య జరిగిన మాటల యుద్ధంపై స్పందించాడు ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. ఆటలో ఇదంతా సాధారణమేనని అభిప్రాయపడ్డాడు.

'People can have conflicts': Morgan on Kohli-Buttler spat in 5th T20I
'మైదానంలో ఆటగాళ్ల మధ్య విభేదాలు సాధారణమే'

By

Published : Mar 22, 2021, 4:36 PM IST

ఇంగ్లాండ్​తో జరిగిన చివరి టీ20లో కోహ్లీ-బట్లర్ మధ్య జరిగిన మాటల యుద్ధంపై ఇంగ్లిష్​ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు.​ క్రికెట్​లో ఇదంతా కొత్తేమీ కాదని.. సాధారణంగా జరిగేదే అని అభిప్రాయపడ్డాడు.

"మైదానంలో ఏం జరిగిందో స్పష్టంగా నాకు తెలియదు. ఆటలో విరాట్ ఎల్లప్పుడూ చురుకుగా ఉంటాడు. ఆటకు సంబంధించి భావోద్వేగాలేవీ అతడు దాచుకోడు. ఉత్కంఠ భరితమైన మ్యాచ్​ల్లో ఆటగాళ్ల మధ్య వివాదాలు సాధారణమే. ఈ సంఘటన అందుకొక ఉదాహరణ అని నేను భావిస్తున్నాను" అని మోర్గాన్ పేర్కొన్నాడు.​

అసలేం జరిగింది?

అహ్మదాబాద్​ వేదికగా జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పర్యటక జట్టు ఆరంభంలోనే రాయ్​ వికెట్​ను కోల్పోయింది. మలన్​తో జట్టు కట్టిన బట్లర్​.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసి.. ఇంగ్లాండ్​ను విజయం వైపు నడిపించాడు. సరిగా ఇదే సమయంలో భువీ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించిన బట్లర్​ క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు. పెవిలియన్​ చేరుతూ కోహ్లీపై మాటల దాడికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య కొన్ని సెకన్ల పాటు మాటల యుద్ధం జరిగింది. చివరకు ఫీల్డ్​ అంపైర్​ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

ఇదీ చదవండి:'వారిని ఓడిస్తే టీమ్ఇండియాదే ప్రపంచకప్'

ABOUT THE AUTHOR

...view details