తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆసియా కప్​ రద్దయిందా.. మాకు తెలియదే!' - బీసీసీఐ

ఆసియా కప్​ రద్దయిన విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదంటోంది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ). టోర్నీ రద్దయిందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తాజాగా వెల్లడించిన నేపథ్యంలో పీసీబీ ఈ విధంగా స్పందించింది.

PCB unaware even as BCCI chief Ganguly says 2020 Asia Cup is cancelled
ఆసియా కప్​ రద్దైన విషయం మాకు తెలియదు: పీసీబీ

By

Published : Jul 9, 2020, 3:43 PM IST

సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్​ రద్దయిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ విషయంపై ఆసియా క్రికెట్​ మండలి (ఏసీసీ) నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని అంటోంది పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు.

ఆసియా కప్​ (పాత చిత్రం)

సమాచారం లేదు

ఆసియా కప్​ను వాయిదా వేస్తున్నట్లు ఏసీసీ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని పీసీబీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇదే విషయంపై పీసీబీ చీఫ్​ ఎహ్సాన్ మణి స్పందిస్తూ.. "ఆసియా క్రికెట్​ మండలి ఆసియా కప్​ను నిర్వహిస్తుందని మేమంతా ఎదురుచూస్తున్నాం. వారు (భారత్​) కొన్ని విషయాల గురించి ఆరా తీస్తున్నారు. బహుశా గంగూలీకి తెలిసిన విషయం నాకు తెలియకపోవచ్చు. కానీ, టోర్నీ రద్దుపై ఏసీసీ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు" అని ఎహ్సాన్ మణి తెలిపినట్లు ఓ పత్రికా విలేకరి వెల్లడించారు. ఆసియా కప్​ నిర్వహణ విషయంపై ఏసీసీ ఛైర్మన్​ నజ్​ముల్ హసన్​ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు.

ఆసియా కప్​ రద్దు

ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్​ రద్దయినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​​​ గంగూలీ స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం కారణంగా టోర్నీ రద్దుకు నిర్ణయించామని తాజాగా ఇన్​స్టాగ్రామ్​ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details