తెలంగాణ

telangana

ETV Bharat / sports

వీడియో కాల్​ ద్వారా ఆటగాళ్ల ఫిట్​నెస్​ పరీక్షలు - కరోనా

దేశవాళీ, జాతీయ ఆటగాళ్ల ఫిట్​నెస్​ పరీక్షలను వీడియో కాల్​ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపింది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు. కరోనా వ్యాప్తి కారణంగా గత నెలలో రద్దు చేసిన వాటిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క క్రీడాకారుడు పరీక్షలకు సిద్ధంగా ఉండాలని కోరింది.

PCB to conduct video fitness test of domestic, international players amid lockdown
వీడియో కాల్​లో ఆటగాళ్ల ఫిట్​నెస్​ పరీక్షలు

By

Published : Apr 9, 2020, 12:03 PM IST

క్రికెటర్లకు వీడియోకాల్​ ద్వారా ఫిట్​నెస్​ పరీక్షలు చేస్తోంది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు. దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిపి దాదాపు 200 మందికి ఏప్రిల్​ 20, 21 తేదీల్లో ఈ టెస్ట్​ను నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 15 నుంచి ఆ దేశంలో క్రికెట్​కు సంబంధించిన కార్యకలాపాలన్నీ ఆపేశారు. గత నెల 23, 24 తేదీల్లోనే ఈ ఫిట్​నెస్​ పరీక్షలు జరగాల్సి ఉండగా రద్దు చేశారు. ప్రస్తుతం ఆ టెస్ట్​లను వీడియో కాల్​ ద్వారా కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. ఆటగాళ్ల కదలికలపై ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపింది.

పాకిస్థాన్​ జట్టు కోచ్​, ఛీఫ్​ సెలెక్టర్​ మిస్బా-ఉల్​-హక్​, ట్రైనర్​ యాసిర్​ మాలిక్.. ఫిట్​నెస్ పరీక్షలకు సిద్ధమవ్వాలని ఆటగాళ్లను గతవారమే సమాచారం అందించారు.

"ఫిట్​నెస్​ సాధించాలంటే క్రమశిక్షణతో పాటు శ్రమించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లకు కావాల్సిన ఉపకరణాలు అందుబాటులో లేని కారణంగా.. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలను కల్పిస్తున్నాం. మేము వంద శాతం సహకారం ఇస్తున్నాం. ఎప్పుడైతే మీరు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉంటారో అప్పడే ఫిట్​నెస్​ పరీక్షకు సమాచారమివ్వండి. అన్ని పరీక్షలు మీ ట్రైనర్​ పర్యవేక్షణలో వీడియోకాల్​ ద్వారా జరుగుతాయి."

-ఆటగాళ్లకు పంపిన సందేశ సారాంశం

పాకిస్థాన్​లో ఇప్పటివరకు 4,194 కరోనా కేసులు నమోదు కాగా, 60 మంది మాహమ్మారి బారిన పడి మరణించారు.

ఇదీ చూడండి.. నెట్టింట పేస్ నయా ఛాలెంజ్.. జర దేఖో

ABOUT THE AUTHOR

...view details