తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేనున్నది టీవీ షోల్లో కూర్చునేందుకు కాదు'

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ అడుగుజాడల్లో తనకు నడవాలని ఉందని చెప్పాడు పాకిస్థాన్​ మాజీ బౌలర్​ షోయబ్​ అక్తర్.​ పాక్​ క్రికెట్​కు సేవలందించే అవకాశాన్ని కల్పించాలని ఆ దేశ బోర్డుకు పరోక్షంగా విన్నవించుకున్నాడు.

PCB should allow me to run cricket: Shoaib Akhtar
'నేనున్నది టీవీ షోల్లో కూర్చునేందుకు కాదు'

By

Published : Mar 18, 2020, 3:32 PM IST

తానున్నది టీవీ షోలలో కూర్చొనేందుకు కాదని పాక్ క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పించాడు ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. తనను క్రికెట్​కు సేవలందించే అవకాశం కల్పించాలని అన్నాడు. బీసీసీఐ అధ్యక్షడు సౌరభ్ గంగూలీ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

తన సహచరులైన రాహుల్​ ద్రవిడ్​.. భారత జాతీయ క్రికెట్​ అకాడమీ బాధ్యతలు, గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడని అన్నాడు అక్తర్. అయితే తనను టీవీ షోలలో కూర్చోపెట్టకుండా, క్రికెట్​లో సేవలందించే అవకాశం కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.​

టీవీ షోల్లో కూర్చోవడం నా పని కాదు

"సౌరభ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు, రాహుల్ ద్రవిడ్, భారత జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డును చూసుకుంటున్నాడు. మార్క్ బౌచర్ ఆ దేశ జట్టుకు ప్రధాన కోచ్, కానీ పాకిస్తాన్​లో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. వారు నన్ను ఉపయోగించుకోవట్లేదు. నా పని టీవీ షోలలో కూర్చోవడం కాదు, క్రికెట్​కు సేవలందించేందుకు అనుమతించాలి" అని అక్తర్ అన్నాడు.

ఇదీ చూడండి..'కరోనాతో నా కెరీర్​లో భిన్నమైన అనుభవం ఎదురైంది'

ABOUT THE AUTHOR

...view details