తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లా టెస్టు సిరీస్ ప్రతిపాదనకు పాక్ తిరస్కరణ

రెండు టెస్టులను చెరో మ్యాచ్ నిర్వహించాలనే బంగ్లాదేశ్ ప్రతిపాదనను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తిరస్కరించింది. పాక్​లో జనవరి 18 నుంచి 3 టీ20 మ్యాచ్​లతో పాటు రెండు టెస్టుల సిరీస్​ ఆడాల్సి ఉంది బంగ్లా జట్టు.

PCB rejects Bangladesh's proposal of playing one Test in Pakistan and other in Dhaka
బంగ్లా టెస్టు సిరీస్ ప్రతిపాదనను పాక్ తిరస్కరణ

By

Published : Jan 5, 2020, 2:14 PM IST

పాకిస్థాన్​ వేదికగా జరగాల్సిన బంగ్లాదేశ్ టీ20, టెస్టు సిరీస్​పై ఇప్పటికీ స్పష్టత రావట్లేదు. తమ దేశంలో రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్ ఆడాలని బంగ్లాను కోరింది పాక్ క్రికెట్ బోర్డు. అందుకు బంగ్లా బోర్డు చెరో టెస్టుకు ఆతిథ్యం ఇస్తే బాగుంటుందని తెలిపింది. తాజాగా ఈ ప్రతిపాదనను పీసీబీ తిరస్కరించింది.

"మా దేశంలో రెండు టెస్టులు ఆడేందుకు ఆహ్వానిస్తే అందులో ఒకటి బంగ్లాదేశ్​లో నిర్వహించాలనడం ఆశ్చర్యమేసింది. బంగ్లా ప్రతిపాదనను మేము తిరస్కరిస్తున్నాం" - పాక్ బోర్డు ప్రతినిధి

జనవరి 18 నుంచి మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​తో పాటు రెండు టెస్టులు ఆడాలని బంగ్లాదేశ్​ను ఆహ్వానించింది పాక్​. అయితే టీ20 సిరీస్​కు అంగీకరించిన బంగ్లా.. టెస్టులకు మాత్రం విముఖత చూపింది. తాజా పరిణామంతో మొత్తం పర్యటనపై స్పష్టత కొరవడింది.

ఇదీ చదవండి: యువీని గుర్తుకుతెచ్చిన కార్టర్.. 6 బంతుల్లో 6 సిక్సర్లు

ABOUT THE AUTHOR

...view details