ఈ ఏడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటన కోసం ఏ బృందాన్ని పంపించాలా అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆలోచన చేస్తోంది. కీలక ఆటగాళ్లు లేకపోవడం వల్ల.. దేశీయ టోర్నీల్లో నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన చెందుతోంది. సుమారు 40 నుంచి 45 మంది క్రికెటర్లను కివీస్‌కు పంపాలని చూస్తున్నట్లు పీసీబీ అధికారిక వర్గాలు తెలిపాయి.
"న్యూజిలాండ్‌లోని కఠిన కొవిడ్ నిబంధనలు, ప్రోటోకాల్స్ కారణంగా రెండు బృందాల్లో మెరుగైన ఆటగాళ్లు ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్నాక.. క్రీడాకారులు, అధికారులు 14 రోజుల క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. మ్యాచ్‌లు ప్రారంభానికి ముందు బయో బబుల్‌లోకి ప్రవేశిస్తారు"