తెలంగాణ

telangana

భారత్‌ ఆడనందుకు.. పాక్‌కు రూ.691 కోట్ల నష్టం

టీమ్​ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్​లు లేకపోవడం వల్ల పాకిస్థాన్​ క్రికెట్ బోర్డుకు రూ.691 కోట్ల నష్టం ఏర్పడింది. భారత్ 2006 తర్వాత పాక్​లో పర్యటించలేదు.

By

Published : Apr 17, 2020, 10:07 AM IST

Published : Apr 17, 2020, 10:07 AM IST

PCB
పాక్

టీమ్‌ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం పాకిస్థాన్‌ క్రికెట్‌ను దెబ్బకొట్టింది. దాంతో గతంలో కుదుర్చుకున్న ప్రసారహక్కుల ఒప్పందం ప్రకారం పాక్‌కు దాదాపు రూ.691 కోట్ల (90 మిలియన్‌ డాలర్లు) నష్టం ఏర్పడింది. ఈ నెలలో ముగియనున్న ఈ ఒప్పందం ప్రకారం గత అయిదేళ్లలో అన్ని సిరీస్‌లకు (పాక్‌లో భారత్‌తో రెండు సిరీస్‌లు కలిపి) గాను 149 మిలియన్‌ డాలర్లకు ప్రసార హక్కులు అమ్ముడయ్యాయి. అయితే భారత్‌తో సిరీస్‌లు జరగకపోవడం వల్ల ఒప్పందం ప్రకారం ఇప్పుడా మొత్తంలో రూ.691 కోట్లు కోత విధించాయి ప్రసార సంస్థలు. భారత్‌ 2006 తర్వాత పాక్‌లో పర్యటించలేదు.

ABOUT THE AUTHOR

...view details