పాకిస్థాన్ ప్రముఖ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. బుకీలు సంప్రదించిన విషయాన్ని బోర్డుకు చెప్పని కారణంగా, నిబంధనల ప్రకారం శిక్ష ఖరారు చేశామని తెలిపింది. ఈ మేరకు పీసీబీ ట్వీట్ చేసింది.
"ఉమర్ అక్మల్‌ను క్రమశిక్షణ ప్యానెల్ ఛైర్మన్ జస్టిస్ ఫజల్ మిరాన్ (రిటైర్డ్) క్రికెట్ నుంచి మూడేళ్లు నిషేధించారు" అని పీసీబీ ట్వీట్ చేసింది.