కరోనా సోకిన 10 మంది జట్టు సభ్యుల(9మంది క్రికెటర్లు, సహాయ సిబ్బందిలోని ఓ వ్యక్తి) పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందని ఆ దేశ మాజీ ఛీప్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ఆరోపించాడు. జట్టు వైద్య బృందం కూడా పట్టిపట్టనట్లు ఉందని మండిపడ్డాడు. ఇలా ఉండటం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైరస్ సోకిన ఆటగాళ్లకు నాణ్యమైన చికిత్సను అందించి, క్లిష్ట పరిస్థితులో అండగా నిలవాల్సిన బాధ్యత బోర్డుకు ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ విషయాల్ని తన యూట్యూబ్ ఛానెల్లో వెల్లడించాడు.
"ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకిన పాక్ క్రికెటర్లకు బోర్డు నుంచి ఎలాంటి మద్దతు లభించట్లేదు. కనీసం వారిని పట్టించుకోవడం లేదు. వైద్య బృందం అలానే వ్యవహరిస్తోంది. వైరస్ సోకిన ఆటగాళ్లు.. సూచనలు, సలహాలు కోసం వైద్యుల్ని సంప్రదించడానికి కాల్స్ చేస్తుంటే కనీసం వారు ఎత్తట్లేదని తెలిసింది. దయచేసి పీసీబీ ఆ ఆటగాళ్లకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను"