ఈ ఏడాది సెప్టెంబరులో దుబాయ్ వేదికగా ఆసియాకప్ జరుగుతుందని.. భారత్, పాక్ జట్లు అందులో పాల్గొంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇటీవల అన్నాడు. తాజాగా పాక్ అందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహ్సాన్ మణి తెలిపాడు.
"ఆసియా క్రికెట్ కౌన్సిల్లోని సభ్యుల నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. పాకిస్థాన్లో ఆడటానికి భారత్ సుముఖత చూపించనందున.. ఇరుజట్లకు ఆమోదయోగ్యమైన వేదికను ఏర్పాటు చేయడానికి త్వరలో జరిగే కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. అయితే ఈ టోర్నీని దుబాయ్ లేదా బంగ్లాదేశ్లో నిర్వాహిస్తారా అనే అంశంపై స్పష్టత లేదు."
- ఎహ్సన్ మణి, పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు