పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు వింత అనుభవం ఎదురైంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి సర్ఫరాజ్నుశుక్రవారం తప్పించిన పీసీబీ.. అదే సమయంలో ట్రైనింగ్ సెషన్లో క్రికెటర్లు డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోను పంచుకుంది. సర్ఫరాజ్‌ను తప్పించినందుకే ఇలా చేశారా అంటూ ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు ట్వీట్ చేశాడు.
ఈ విషయంపై స్పందించిన పాక్ బోర్డు.. వెంటనే ఆ వీడియోను తొలగించి, క్షమాపణ చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ఈ సమయంలో పంచుకుని ఉండాల్సింది కాదంటూ చెప్పింది. ఈ సంబాషణ అంతా ఇప్పుడు వైరల్ అవుతోంది.