తెలంగాణ

telangana

ETV Bharat / sports

'డబ్బు కడతారా? వాంఖడేను ఖాళీ చేస్తారా??' - undefined

మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి క్రికెట్ అసోసియేషన్​కు నోటీసులు పంపింది. వాంఖడే మైదానం లీజుకు సంబంధించి దాదాపు రూ. 120 కోట్లు కట్టాలని ఆదేశించింది.

వాంఖడే

By

Published : Apr 23, 2019, 9:33 AM IST

ముంబయి క్రికెట్ అసోసియేషన్​కు(ఎమ్​సీఏ) మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. వాంఖడే స్టేడియం లీజు గడువు పూర్తయినా సంబంధిత చెల్లింపులు పూర్తిచేయలేదని గుర్తుచేసింది. దాదాపు రూ. 120 కోట్లు చెల్లించాలని ముంబయి నగర కలెక్టర్ శివాజీ ఏప్రిల్ 16న ఎమ్​సీఏ అధికారులకు నోటీసులు పంపారు.

మే 3లోపు సంబంధిత పత్రాలు సమర్పించి డబ్బు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ ఎమ్​సీఏ డబ్బు కట్టకపోతే వాంఖడే మైదానాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.

"ముంబయి క్రికెట్ అసోసియేషన్ లీజు పత్రాలను సమర్పించింది. ఈ సొమ్ము వారికి చాలా తక్కువ మొత్తం. మే 3న జరిగే సమావేశం తర్వాత ఎమ్​సీఏపై భవిష్యత్ నిర్ణయం తీసుకుంటాం" -శివాజీ జొంధాలే, ముంబయి నగర కలెక్టర్

43, 977 చదరపు అడుగుల విస్తీర్ణం గల వాంఖడే మైదానాన్ని ముంబయి క్రికెట్​ అసోసియేన్​కు 50 ఏళ్ల కాలానికి లీజుకిచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కాలపరిమితి గతేడాది ఫిబ్రవరికే పూర్తయింది.

ఇవీ చూడండి.. ఐపీల్ 12: బౌలింగ్​లో ఎవరి దమ్ము ఎంత?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details